విశాఖపట్నం

కవిత్వాన్ని ఊపిరిగా మలిచిన మోత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శరీర బరువు మోతకన్నా కష్టాలు కన్నీళ్లు, అపవాదులు, వ్యసనాలు మున్నగువాటిని మోసే మోతే ఎక్కువంటున్న కవి ఇంకా ఇలా అంటున్నాడు. ఎందరో శత్రువులు నాలోనే దాక్కున్నారు. నాలోనే ప్రపంచ యుద్ధాలున్నాయి. వీటన్నింటినీ నిత్యం మోస్తున్నా అన్నీ మోసిన వానికి ఈ మోత ఓలెక్కా? ప్రపంచ మోతలన్నింటీనీ నేనే మోస్తున్నా, నాకు నేనే ప్రళయాన్ని సృస్టించుకుంటాను. పరిష్కార మోతల్ని మోస్తూనే ఉంటాను అంటున్న కవిలో ఒక రైతు, ఒక శ్రామికుడు, ఓ కష్టజీవి, ఓ నిర్భాగ్యుడు ప్రతిబింబిస్తాడు పాఠకుల మదిని దోస్తాడు. కదలికనిస్తాడు.
ఈ కవితా సంపుటి 66 కవితల సమాహారం. కొన్నిటిలో మానవత్వం తొణికిసలాడుతుంది. కొన్నిటిలో శ్రమైకజీవనం, అవినీతిని అంతంజేయడంలో పరిష్కార సూచన. నీతి నిజాయితీలు, మైత్రి, పరోపకారం, జీవ లక్షం వంటి వివాంఛనీయమని మనిషిని మనీషిగా చూడాలన్న ఆకాంక్షతో పెల్లుబిన కవితల్ని ఆవిష్కరించిన ప్రతిభాశాలి, ఉపాధ్యాయ అవార్డుగ్రహీత, కవిగా తెలుగువారికి, సుపరిచితులై ఐదవ కావ్యానందించిన అంబటి నారాయణ నిర్మల్ (అదిలాబాద్) వాసి.
తన మోత కవితల ద్వారా నవజీవనశైలిని మనిషిలో మార్పుని కోరుతాడు తద్వారా సమాజ వికాసాన్ని దేశకల్యాణాన్ని ఆకాంక్షిస్తాడు.
ఆకలితో అలమటిస్తున్న అనాధల మధ్యనున్న నేను ఆవిష్కరించుకుంటాను. అంటున్న కవి ఆవేదన అగుపిస్తుంది. ఈ దేశంలో జంతువులు కూడా ఆకలితో అలమటించ కూడదన్న స్వామి వివేకానందుని వాణి ప్రతిధ్వనిస్తుంది.
మగాళ్లలో మృగాళ్లున్నారు. రాబందులు రెక్కలు విసరకముందే, కామాంధులు పక్కలు పరవకముందే, మేల్కొండి అంటూ స్ర్తిజాతిని మేల్కొలపడం వాంఛనీయం, అనివార్యం, అభినందనీయం.
నీ పిలుపుతో నిరాశా నిస్పృహలలో, మ్రగ్గేవారికి, ఒక ప్రేమపూర్వక పిలుపు జవజీవాల నందిస్తాయి. చైతన్యాన్ని నింపుతాయనడం అక్షర సత్యం. జీవన సూత్రంలో జీవన పోరాటమే ఆరాటంగా మల్చుకోవాలని, స్వశక్తిని నమ్ముకున్నవారనికి, అపజయం ఉండదన్న కవి పంక్తులు ఊరటనిస్తాయి. ఉత్సాహాన్నందిస్తాయి. స్వాగతించదగినవి.
రక్తాన్ని చెమటగా మార్చే కర్షకుణ్ణి నేను / నా అక్షరసేద్యం మానవీయ మతంకోసం / సమాజహితం కోసం / కవుల కలాల్లో కండ బలముంది / గళాల్లో గుండెధైర్యముంది / మనిషి అంతర్గత శక్తి అక్షరమే / బాధల మోతల్ని పోగొట్టేది, అక్షరం దొంగలకు దొరకని ఆస్తి, అంటున్న కవి, మన జీవితంలో మనపాత్ర ఏమిటో, నిర్ణయించుకోవాలన్న హెచ్చరికనందిస్తూ మనమాటలు ఎదుటివారి ప్రగతిబాటలు కావాలి వారి ఎదుగుల్లో పూదోటలు పూయించాలంటున్న కవి పంక్తులు పరమాన్న సదృశాలు పన్నీటి పరిమాళాలు పౌర్ణమినాటి వెనె్నలలు.
కొలతకు అందని కోవెల హృదయం అమ్మసాగరమంత విశాలం నాన్న ఎద సదనం, అర్థాంగిలో అమ్మతనం ఉంది. అంటూ తల్లిదండ్రులు భార్యపై అపారప్రేమను వ్యక్తం చేసాడు. ప్రతివారూ కోరదగింది స్వాగతించగదిగింది.
స్నేహం ఒక మధురానుభవం / అనంతకాల గమనంలో ఆత్మీయ మెరుపు అన్న పంకులు దాశరధి గారి తైలాలు, లేకుండ వెలిగేటి దీపం, స్నేహదీపం, కవిత గుర్తుకొస్తుంది. దాశరధి కవిని స్మరణకు తెస్తుంది.
విద్యార్థి నిత్యం మోస్తున్న మోత పుస్తకాల మోత, మానసిక మోత స్థాయిని మించిన మోత, పోటీ యుగంలో వికసించే నవ్వులేదు. విరబూసే పువ్వులేదు. మనసులో దిగులు తెలియని గుబులు పెద్దల కలల మోతల్ని వారినెత్తిన మోపిన మోత అంటూ పుస్తక శీర్కి మోత చక్కని రూప కల్పన చమత్కారం రంగరించడంలో కవిప్రతిభ కన్పిస్తుంది.
కుళ్ళిన శరీరంలో నా ఆత్మకొట్టుకుంటోంది/ కీచక పర్వంలోనే ఓడిపోయా అంటున్న నిర్భయ కుసుమం కవిత కళ్లు చెమ్మగిల్ల చేస్తుంది. వృద్ధాప్యం కవితలు సహకరించని అవయాలు తగ్గిన చురుకుదనం/శక్తి సన్నగిల్లింది / చూపు మందగించింది. ఆకృతిలో మార్పు వచ్చింది. ప్రకృతిలో వికృతి వచ్చింది. అన్నపంక్తులు సందేశాత్మకాలు. ప్రతులకు నెం. 9849326801ను సంప్రదించగలరు.
కవిని అభినందిస్తూ మరిన్ని కావ్యాలను మంచి పాకంతో వెలయించాలని ఆకాంక్షిద్దాం.

- చెళ్ళపిళ్ళ సన్యాసిరావు