బిజినెస్

త్వరలోనే 4జి వాణిజ్య సేవలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రకటించిన రిలయన్స్ జియో అధినేత ముఖేశ్ అంబానీ
ముంబయి, డిసెంబర్ 28: రిలయన్స్ జియో 4జి వాణిజ్య సేవలు త్వరలోనే ప్రారంభిస్తామని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్) చైర్మన్ ముఖేశ్ అంబానీ తెలిపారు. రిలయన్స్ గ్రూప్ వ్యవస్థాపక అధినేత, ముఖేశ్ తండ్రి ధీరుభాయ్ అంబానీ 83వ జన్మదినం సందర్భంగా ఆదివారం ఇక్కడ ఆర్‌ఐఎల్ టెలికాం విభాగమైన జియో ఇన్ఫోకామ్ 4జి సేవలను అందుబాటులోకి తెచ్చినది తెలిసిందే. అయితే తొలుత రిలయన్స్ గ్రూప్ ఉద్యోగులకే ఈ సేవలను అందించిన జియో.. రాబోయే వారాల్లో కస్టమర్లందరికీ అందిస్తుందని ముఖేశ్ స్పష్టం చేశారు.
కాగా, అట్టహాసంగా జరిగిన 4జి సేవల ప్రారంభోత్సవంలో ముఖేశ్ కుటుంబ సభ్యులతోపాటు తల్లి కోకిలాబేన్, సోదరుడు అనీల్ అంబానీ కుటుంబ సభ్యులు, సోదరీమణులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. రిలయన్స్ గ్రూప్ ఉన్నతోద్యోగులూ హాజరయ్యారు. రిలయన్స్ జియో బ్రాండ్ అంబాసిడర్ షారూఖ్ ఖాన్, ప్రముఖ సంగీత దర్శకుడు ఎఆర్ రెహమాన్ ఇచ్చిన ప్రదర్శన ఆహూతులను అలరించాయి. ** ముఖేశ్ అంబానీ కుటుంబం, ఎఆర్ రెహమాన్‌తో షారూఖ్ ఖాన్ సెల్ఫీ