బిజినెస్

ఏపి సహా ఐదు రాష్ట్రాల్లో 28 గనుల వేలానికి నోటీసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ వెల్లడి
న్యూఢిల్లీ, డిసెంబర్ 3: దేశంలోని వివిధ ప్రాంతాల్లో గల ఇనుము, సున్నపురాయి తదితర 70 గనులకు త్వరలో తొలి విడత వేలం నిర్వహించేందుకు ప్రయత్నిస్తున్న కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా ముందడుగు వేసింది. వీటిలో 28 గనుల వేలానికి టెండర్లను ఆహ్వానిస్తూ ఆంధ్రప్రదేశ్, చత్తీస్‌గఢ్, ఒడిశా సహా ఐదు రాష్ట్రాలు నోటీసులు జారీ చేశాయి. న్యూఢిల్లీలో గురువారం సిఐఐ (్భరత పరిశ్రమల సమాఖ్య) నిర్వహించిన ఒక కార్యక్రమం సందర్భంగా కేంద్ర ఉక్కు, గనుల శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ఈ విషయాన్ని వెల్లడించారు. గనుల రంగంలో విస్తారంగా ఉన్న అవకాశాలను అందిపుచ్చుకునేందుకు వీలుగా పెట్టుబడులను రాబట్టుకునేందుకు త్వరలో ఆకర్షణీయమైన ఖనిజానే్వషణ విధానాన్ని ఆవిష్కరిస్తామని ఆయన పేర్కొంటూ, తొలి విడత గనుల వేలానికి సంబంధించి పక్షం రోజుల్లో మరో నాలుగు రాష్ట్రాలు కూడా నోటీసులు జారీ చేస్తాయని భావిస్తున్నట్లు తెలిపారు. ‘దేశంలో గనుల కేటాయింపులు పారదర్శకంగా జరిగేలా చూసేందుకు ఎంఎండిఆర్ చట్టాన్ని సవరించడంతో వీటి వేలం ప్రక్రియ ముందుకు సాగుతోంది. తొలి విడతలో వేలం వేయాలని ప్రతిపాదించిన 70 గనుల్లో 28 గనులకు టెండర్లను ఆహ్వానిస్తూ ఐదు రాష్ట్రాలు నోటీసులు జారీ చేశాయి. పక్షం రోజుల్లో మరో నాలుగు రాష్ట్రాలు కూడా ఇటువంటి నోటీసులు జారీ చేస్తాయని భావిస్తున్నాం. ఏది ఏమైనప్పటికీ జనవరి నాటికి తొలి విడత గనుల వేలం పూర్తవుతుందని ప్రభుత్వం ఆశిస్తోంది’ అని ఆయన అన్నారు.