బిజినెస్

టిఎస్‌పిడిసికి నవ భారత్ వెంచర్స్ విద్యుత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 19: తెలంగాణ స్టేట్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ (టిఎస్‌పిడిసి)కు విద్యుత్ సరఫరా కోసం టాటా పవర్ ట్రేడింగ్ కంపెనీ లిమిటెడ్ (టిపిటిసిఎల్)తో నవ భారత్ వెంచర్స్ ఓ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు శనివారం బిఎస్‌ఇకి నవ భారత్ వెంచర్స్ తెలిపింది. ‘మే 27, 2016 నుంచి మే 25, 2017 వరకు తెలంగాణ రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలకు విద్యుత్‌ను సరఫరా చేసేలా టాటా పవర్ ట్రేడింగ్ కంపెనీ లిమిటెడ్‌తో ఒప్పందం చేసుకున్నాం.’ అని నవ భారత్ వెంచర్స్ లిమిటెడ్ తెలిపింది. విద్యుదుత్పత్తి, ఫెర్రో అల్లోస్, మైనింగ్, వ్యవసాయ ఆధారిత వ్యాపారాల్లో నవ భారత్ కార్యకలాపాలున్నాయి. భారత్‌తోపాటు ఆగ్నేయాసియా, ఆఫ్రికా దేశాల్లో సంస్థ వ్యాపారాలు నడుస్తున్నాయి.