జాతీయ వార్తలు

3 వరకు లాక్ డౌన్ కొనసాగింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: దేశంలో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం మంగళవారంతో ముగుస్తున్న 21 రోజుల లాక్‌డౌన్‌ను ఈ నెలాఖరు వరకు పొడిగించే అవకాశాలున్నాయ. కరోనా వైరస్‌ను కట్టడి చేస్తూనే లాక్‌డౌన్ కారణంగా స్తంభించిపోయిన దేశ ఆర్థిక వ్యవస్థను పునరుజ్జీవింపజేసేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రెండంచెల విధానాన్ని అవలంబించవచ్చునని అంటున్నారు. కరోనాను కట్టడి చేసేందుకు ఒకవైపు లాక్‌డౌన్ కొనసాగిస్తూనే మరోవైపు వ్యవసాయ రంగం, నిత్యావసర వస్తువులను రవాణా చేసే అంతర్‌రాష్ట్ర, అంతర్ జిల్లా రవాణాను అనుమతించటం, కొన్ని ఎంపిక చేసిన పరిశ్రమలు పని చేసేందుకు అనుమతించటం, నిర్మాణ రంగాన్ని ఎంపిక చేసిన కొన్ని ప్రాంతాల్లో అనుమతించటం ద్వారా ఆత్యంత దుర్భర స్థితిలో ఉన్న కార్మికులు, రోజువారీ కూలీలను ఆదుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలిసింది. ప్రధాన మంత్రి ఇటీవల 13 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో లాక్‌డౌన్, దాని పర్యవసానం, కరోనా కట్టడి గురించి చర్చించినప్పుడు ఈ ప్రాథమిక మినహాయింపుల గురించి చర్చించినట్లు తెలిసింది. నరేంద్ర మోదీ మంగళవారం ఉదయం పది గంటలకు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగంలో లాక్ డౌన్ పొడిగింపు, కొన్ని రంగాలకు ఇవ్వనున్న మినహాయింపుల గురించి వివరించవచ్చని తెలుస్తోంది. దేశవ్యాప్త లాక్‌డౌన్‌ను ఈ నెలాఖరు వరకు పొడిగించినా వ్యవసాయం, సరుకుల రవాణా, కొన్ని పెద్ద పరిశ్రమలను దీనినుంచి మినహాయించే అవకాశాలున్నాయని సీనియర్ అధికారులు చెబుతున్నారు.
తెలంగాణ, పంజాబ్, రాజస్తాన్, ఒడిశా ప్రభుత్వాలు ఇప్పటికే లాక్‌డౌన్‌ను ఏప్రిల్ 30వ తేదీ వరకు పొడిగించటం తెలిసిందే. పలు ఇతర రాష్ట్రాల కూడా కరోనా వైరస్‌ను నిలువరించేందుకు లాక్‌డౌన్ పొడిగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరాయి. లాక్‌డౌన్ ఏ విధంగా ఉండాలి, ఏ ప్రాంతాల్లో పూర్తి స్థాయి లాక్‌డౌన్ ఉండాలి, ఏ ప్రాంతాల్లో దీనిని సులభతరం చేయాలనే అంశంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లోతుగా ఆలోచిస్తున్నాయి. కరోనా వైరస్ ఉధృతి ఆధారంగా రాష్ట్రాలు లేదా ప్రాంతాలను రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్‌లుగా విభజించి రెడ్ జోన్లలో మినహాయింపులు లేని లాక్‌డౌన్, ఆరెంజ్ జోన్లలో కొన్ని మినహాయింపులతో కూడిన లాక్‌డౌన్, గ్రీన్ జోన్లలో లాక్‌డౌన్‌ను తొలగించే ప్రతిపాదన పరిశీలనలో ఉన్నదని అంటున్నారు. అయితే, కొన్ని బస్తీలను కలర్ కోడ్ ఆధారంగా విభజించి అదుపు చేయవచ్చు కానీ రాష్ట్రాలు, జిల్లాలను కట్టడి చేయటం సాధ్యం కాకపోవచ్చునని అధికారులు భావిస్తున్నారు. కరోనా వైరస్ కేసులు అధికంగా ఉన్న దేశ రాజధాని ఢిల్లీ, ముంబయి, పూణె, ఇండోర్, గుర్‌గావ్, హైదరాబాద్, అహ్మదాబాద్, జైపూర్, బెంగళూరులో పూర్తి స్థాయి లాక్‌డౌన్‌ను ఈనెలాఖరు వరకు అమలు చేయవచ్చునని అంటున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఏప్రిల్ 30 వరకు లాక్‌డౌన్‌ను పొడిగించటం తెలిసిందే. కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు విధించిన లాక్‌డౌన్ కారణంగా కుంటుతూ నడుస్తున్న దేశ ఆర్థిక వ్యవస్థ మరింత దెబ్బతింటుందని ప్రపంచ బ్యాంకు హెచ్చరించటం తెలిసిందే. జీడీపీ ఒకటిన్నర శాతానికి పడిపోయే పరిస్థితులు నెలకొంటున్నాయని ప్రపంచ బ్యాంకు అంచనా వేయటం తెలిసిందే. రాష్ట్రాల అర్థిక పరిస్థితి కూడా అధ్వాన్నంగా తయారైంది. పరిశ్రమలతో పాటు వ్యాపార, వాణిజ్యం కూడా పూర్తిగా స్తంభించిపోవటంతో కేంద్రంతోపాటు రాష్ట్రాల అదాయం పూర్తిగా పడిపోయింది. అందుకే ఒక వైపు కరోనాను అదుపు చేయటంతోపాటు దేశ ఆర్థిక వ్యవస్థను ముందుకు నడిపించేందుకు అవసరమైన వ్యూహాన్ని ప్రధాని మోదీ సిద్ధం చేస్తున్నారని సమాచారం. ఎంపిక చేసిన పరిశ్రమల్లో కార్మికులు అక్కడే ఉండే పనిచేసే విధంగా చర్యలు తీసుకునే అవకాశాలున్నాయి.
*చిత్రం...వైశాఖీని పురస్కరించుకొని అమృత్‌సర్ స్వర్ణ దేవాలయం వద్ద పవిత్ర స్నానం చేస్తున్న భక్తుడు