జాతీయ వార్తలు

వీసా, ఈ - వీసాల గడువు పెంపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: కోవిడ్-19 కారణంగా స్వదేశాలకు వెళ్లలేకపోయిన విదేశీయులకు వీసా, ఈ-వీసా పరిమితి గడువును పెంచుతూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వెసులుబాటును కల్పించింది. ఈ మేరకు సోమవారం ఒక అధికారిక ప్రకటనను విడుదల చేసింది. ఇటీవల భారత్ వచ్చిన పలువురు విదేశీయులు తిరిగి తమ స్వదేశాలకు వెళ్లేందుకు గడువు తీరిపోతే, అలాంటి వారికి ఈనెల 30వరకు వీసా, ఈ-వీసా గడువును పొడిగించింది. కోవిడ్-19 వల్ల ఈ ఏడాది ఫిబ్రవరి 1వ తేదీ అర్ధరాత్రి నుంచి ఏప్రిల్ 30 అర్ధరాత్రి వరకు గడువు కలిగిన విదేశీయుల వీసా, ఈ-వీసా గడువు కాలపరిమితిని ఏప్రిల్ 30వరకు పొడిగించింది. వీసాలు లభించక మార్చి 24 నుంచి 21 రోజులపాటు దేశవ్యాప్తంగా విధించిన లాక్ డౌన్ కారణంగా ఇక్కడే ఉండిపోయిన విదేశీయులందరికీ ఈ తాజా నిబంధనలు వర్తిస్తాయని పేర్కొంది. ఈ విషయంలో ఎలాంటి అనుమానాలకు తావు లేదని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. కాగా, రెగ్యులర్, ఈ-వీసాలు కలిగిన విదేశీయులు తమ దేశాలకు వెళ్లేందుకు గడువు ఏప్రిల్ 15వరకు విధించింది. కానీ దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో విమానాలు సహా వివిధ ప్రయాణ రంగాలపై తీవ్ర ప్రభావం పడడంతో లాక్ డౌన్‌ను ఈనెల 30 వరకు పొడిగిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. తొలుత 21 రోజులపాటు విధించిన లాక్ డౌన్‌ను కరోనా తీవ్రత నేపథ్యంలో మరో 15 రోజులపాటు పొడిగించడంతో మన దేశంలో ఉన్న పలువురు విదేశీయుల వీసా, ఈ-వీసా గడువును ఈనెల 30 తేదీ వరకు పొడిగిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.