జాతీయ వార్తలు

రెండు వారాలుగా కొత్త కేసుల్లేవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: దేశ వ్యాప్తంగా అత్యంత కట్టుదిట్టంగా అమలవుతున్న లాక్ డౌన్ వల్ల కరోనా వైరస్ అదుపులోకి వస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. దేశ వ్యాప్తంగా 15 రాష్ట్రాల్లోని 25 జిల్లాల్లో గత 14 రోజులుగా కొత్తగా ఎలాంటి కేసు నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం ప్రకటించింది. జిల్లా పాలనా యంత్రాంగాలు అత్యంత కఠినంగా లాక్ డౌన్‌ను అమలు చేయడం వల్లే ఈ విజయాన్ని సాధించగలిగామని ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ వెల్లడించారు. సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన గత 24 గంటల్లో 796 కోవిడ్-19 కేసులు కొత్తగా వెలుగులోకి వచ్చాయని, 35 మంది మరణించారని తెలిపారు. దీంతో దేశంలో కోవిడ్-19 కేసుల సంఖ్య 9,152కు చేరుకోగా మృతుల సంఖ్య 308కి పెరిగింది. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యాచరణ ప్రణాళిక 15 రాష్ట్రాల్లోని 25 జిల్లాల్లో స్పష్టమైన ఫలితాలను ఇస్తోందని ఆయన తెలిపారు. గత 14 రోజులుగా ఈ జిల్లాల్లో కొత్తగా కరోనా కేసు ఏదీ రాలేదని, భవిష్యత్తులో కూడా కొత్త కేసులు తలెత్తకుండా అన్ని రకాలుగానూ జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఆయన చెప్పారు. మహారాష్టల్రోని గోండియా, ఛత్తీస్‌గడ్‌లోని రాజ్‌నంద్‌గావ్, కర్నాటకలోని దావణగిరి, కేరళలోని వాయ్‌నాడ్, కొట్టాయం, మణిపూర్‌లోని పశ్చిమ ఇంఫాల్, జమ్మూ-కాశ్మీర్‌లోని రజౌరి, మిజోరంలోని ఐజ్వాల్, పాండిచ్చేరి లోని మహేర్, పంజాబ్‌లోని ఎస్‌బీఎస్ నగర్, బీహార్‌లోని పాట్నా, నలంద, ముంగేర్, రాజస్థాన్‌లోని ప్రతాప్‌ఘర్, తెలంగాణలోని కొత్తగూడెం, హర్యానాలోని రోహతక్, సిర్సా జిల్లాల్లో కొత్తగా కోవిడ్ కేసులేవీ నమోదు కాలేదని ఆయన తెలిపారు.