బిజినెస్

బుల్ రంకె..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఆగస్టు 27: అంతర్జాతీయ మార్కెట్‌లో సానుకూల పవనాలు, కొనుగోలుదారుల మద్దతు లభించడంతో భారతీయ స్టాక్ మార్కెట్లు సోమవారం దూసుకుపోయాయి. బుల్ పరుగులతో సెనె్సక్స్, నిఫ్టీ కొత్త శిఖరాలకు చేరాయ. బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్‌లో సెనె్సక్స్ 442 పాయింట్లు లాభపడి, 38,694.11 పాయింట్ల వద్ద, నిఫ్టీకి 134.85 పాయింట్ల లాభంతో 11,691.95 పాయింట్ల వద్ద ముగిసింది. సెనె్సక్స్, నిఫ్టీలు గత కొన్ని నెలల కాలంలో ఇంత పెరుగుదలను నమోదు చేయడం ఇదే మొదటిసారి. ఏప్రిల్ 5న సెనె్సక్స్ 577.73 పాయింట్లు, నిఫ్టీ 196.75 పాయింట్లు పెరిగాయ. వడ్డీ రేట్లను క్రమంగా పెంచుతామని, తద్వారా మరింతగా ఉపాధి కల్పనకు అవకాశం లభిస్తుందని గత వారం అమెరికా ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పావెల్ చేసిన ప్రకటన అంతర్జాతీయ మార్కెట్‌పై ప్రభావం చూపింది. ఫలితంగా భారతీయ స్టాక్ మార్కెట్‌లోనూ బుల్ రంకె వేయగలిగింది. కాగా, సోమవారం నాటి బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ లావాదేవీల్లో భారతి ఎయిర్‌టెల్ 3.93, పవర్ గ్రిడ్ 2.97, ఎస్‌బీఐ 2.65, ఇన్ఫోసిస్ 2.53 శాతం చొప్పున లాభపడ్డాయి. సన్ ఫార్మా 1.25 శాతం నష్టాన్ని చవిచూసింది. విధంగా నిఫ్టీ లావాదేవీల్లో హిందాల్‌కో 3.65, పవర్ గ్రిడ్ 3.35, టెక్ మహీంద్ర 3.21, ఐసీఐసీఐ బ్యాంక్ 2.92 శాతం లాభాలను ఆర్జించాయి. సన్ ఫార్మా 1.32, బజాజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.29, డాక్టర్ రెడ్డీస్ 0.10 శాతం చొప్పున నష్టాలను చవిచూశాయి.