నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తే. ఊరుమూల మేర్పడఁగ నయ్యు విద వలుపు
దొలఁగె ననిలంబు చేత విధూత మగుచు
ననురు లెల్లఁ బరాఙ్మలైరి దాని
సాభిలాషుఁ డై చూచె మహాభిషుండు
భావం: గంగాదేవి కట్టుకొన్న చీర గాలికి ఎగుర గొట్టబడటం చేత ఆమె తొడల లో భాగం కనపడేటట్లుగా తొలగింది. దానిని దేవతలందరూ చూడక మొగాలు ప్రక్కకు తిప్పుకున్నారు. కాని మహాభిషుడు మాత్రం ఆసక్తితో దానిని చూచాడు.
ఇక్ష్వాకువంశంలో పుట్టిన మహాభిషుడనే రాజు ఎంతో ధర్మతత్పరుడై జీవిం చాడు. అతడు ఎన్నో వేల యజ్ఞాలను, క్రతువులను చేసేవాడు. ఆరాజు చేసే యజ్ఞాదుల వల్ల దేవతలు మిక్కిలి ప్రీతి చెందేవారు. ఓసారి ఆ మహాభిషుడు స్వర్గలోకానికి వెళ్లాడు. అక్కడ దేవతలతోను, ఋషి గణాలతోను మాట్లాడుతుండగా అక్కడే ఉన్న గంగాదేవికి ఇలాంటి ఉపద్రవం ఏర్పడింది. అపుడు ఆ గంగాదేవిని మహాభిషుడు ఆసక్తిగా చూడడం జరిగింది.

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము