మంచి మాట

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉ. దాని శరీర సౌరభము, దాని విలోల విలోకనంబులున్
దాని మనోహరాకృతియు, దాని శుచిస్మిత వక్త్రకాంతియున్
దాని విలాసముం గడు ముదంబునఁ జూచి మనోజబాణసం
తాన హతాత్ముఁడై నృపతి దానికి నిట్లనియెం బ్రియంబునన్

భావం: గంగాతీరంలోదివ్యకన్యను చూచిన శంతనుడు పరవశుడైనాడు. ఆ స్ర్తి శరీర పరిమళాన్నీ , ఆమె చలించే కన్నులనూ, ఆమె అందమైన ఆకారాన్నీ, తెల్లని చిరునవ్వుతో కూడిన ఆమె ముఖకాంతినీ, ఆమె శృంగార హావభావ లీలను మిక్కిలి సంతోషంతో చూచి మన్మథ బాణాలతో కొట్టబడిన హృదయం కలిగినవాడై అనగా మదనవికారానికి లోనై అనురాగంతో ఆమెను చూచాడు.

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము