నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చ. వినుఁడు ప్రసిద్ధులైన పృథివీపతులిందఱు నే గురు ప్రయో
జనమున ఁ జేసితిన్ సమయసంస్థితి ; రుూ లలితాంగికుద్భవించి
చిన తనయుండ రాజ్యమును జేయఁగ నర్హుఁడ వాఁడ మాకు నె
ల్లను బతి; వాఁడ కౌరవకులస్థితి కారుఁ డు దార సంపదన్
భావం: సత్యవతికి పుట్టిన కుమారులను శంతనమహారాజు రాజ్యాధికారం పొందదగిన వారుగా చేస్తానంటే సత్యవతినిచ్చి శంతనునికి వివాహం చేయడం తనకు ఇష్టమని చెప్పిన దాశరాజు దగ్గరకు గాంగేయుడి వెళ్లగా నీ వలన సత్యవతికి పుట్టిన బిడ్డలకు సవతి బిడ్డలన్న దోషం ఏర్పడి రాజ్యాధికారం పొందడానికి వీలుండదు కనుక ఆ దోషం నీవు పోగొట్టితే నేను సత్యవతిని శంతనునికి ఇస్తానని చెప్పాడు. అది విన్న గాంగేయుడు ఇలా చెబుతున్నాడు. ఇచ్చట సమావేశమైయున్న ప్రసిద్ధ ప్రభువులందరూ వినండి. నేను తండ్రిగారి ప్రయోజనం కొరకు స్థిరమైన ఒక ప్రతిజ్ఞ చేశాను. అదేమంటే - ఈమెకు పుట్టిన కొడుకే రాజ్యం చేయడానికి హక్కుకలవాడౌడు. అతడే మా కందరికీ ప్రభువుగా పరిగణింపబడుతాడు. అతడే గొప్పదైన సంపత్తితో కౌరవ వంశాన్ని నిలిపేవాడు ఔతాడు.
శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము