నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క. వదలక మాయా యుద్ధా
తిదక్షఁడయ వంచనోన్నతిన్ గంధర్వుం
రుదితర విజతేజు ఁజిత్రాం
గదుఁ జంపి విచిత్ర పత్త్రకార్ముక హస్తున్
భావం: మాయా యుద్ధంలో మిక్కిలి నేర్పరి అయన గంధర్వుడు విచిత్రాలైన బాణకోదండాలను చేతుల్లో ధరించి ఉదయంచే సూర్యుడి వలె ప్రకాశించే చిత్రాంగదుడిని పట్టువిడవకుండా పోరి చంపాడు. సత్యవతి శంతనులకు పుట్టిన చిత్రాంగదుడు రాజ్య పాలనకు వచ్చి అహంకరించాడు. తానే అధికుడినని ఋషులను, దేవతలను అవమానించాడు. సాటివారిని చులకన చేశాడు. రాక్షసులను కూడా తన భుజబలంతో ఎదిరించాడు. కనుక తాను ఎవరికీ తలొంచక్కర్లేదని విర్రవీగాడు. అహంకారంతో ప్రవర్తించాడు. తాను పాలించే జనుల అక్కరను గుర్తించక తాను సుఖంగా వీరునిగా ఉండాలనుకొన్నాడు. కనుక గంధర్వడైన చిత్రాంగదుడు వీని పోకడను భరించలేక ద్వంద్వయుద్ధానికి పిలిచాడు. మామూలు సమరమైతే భీష్ముడు యుద్ధ్భేరి మోగిస్తాడు కనుక ద్వంద్వయుద్ధానికి పిలిచి సంహరించాడు.

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము