నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉ. ‘ఈవసుధాధినాథుల జయించిన యట్టిద కాదు; చక్కనై
పోవక నిల్వు నా కెదరిపోర మదీయ ధనుర్విముక్త నా
నావిధ మార్గణోగ్ర గహనంబున దిగ్ భ్రమఁబొంద కెమ్మెయిం
శోవఁగఁ బోలు నీకనుచుఁ బూరుకు లోత్తముఁ దాఁకె వీఁకతోన్

భావం: గర్వోన్నతులైన క్షత్రియులను మట్టుపెట్టిన పరశురాముని వలె భీష్ముడు విజృంభించాడు. ఆ భీముని ధాటికి ఎదురునిలువలేక రాజులందరూ చెల్లాచెదురు అయినారు. కాని ఈ రాజులను జయించడం జయించడటం వంటిదే కాదు. అట్లా సూటిగా పోకుండ నన్ను ఎదిరించి యుద్ధం చేయటానికి నిలుచుండుము. నా విల్లు నుండి విడువబడిన బహువిధాలైన బాణాలనే భయంకరమైన అరణ్యంలో దిక్కుత్రోవలు తెలియక అబ్బురపాటు పొందకుండా ఎక్కడికిపోతావు?’ అని అంటూ సాల్వుడు పూరువంశంలో ఉత్తముడైన భీష్ముని మీద గర్వంతో బాణాలు వేశాడు.

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము