నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మ పరుజూచున్ వరుజూచు నొంప నలరింపన్, రోషరాగోదయం
విరత భ్రూకుటి మందహాసములతో వీరంబు శృంగారమున్
జరగన్, గన్నుల గెంపు సొంపు బరగం జండాస్త్ర సందోహమున్
సరసాలోక సమూహమున్ నెఱపుచుం జంద్రాస్య హేలాగతిన్

భావము: చంద్రుని వంటి ముఖము కలిగిన సత్యభామ కోపంతో కనుబొమలు ముడివేసి వీరత్వం మూర్త్భీవించినట్లు కన్నులెఱ్ఱజేసి, వాడియైన బాణాలను ప్రయోగిస్తూ శత్రువైన నరకాసురుణ్ణి నొప్పిస్తున్నది. అదే సమయంలో అనురాగంతో మందహాసం చేస్తూ, శృంగారం ఆకారం దాల్చినట్లు సొంపైన చూపులతో సరసపు చూపులు ప్రసరింపజేస్తూ పతియైన శ్రీకృష్ణుణ్ణి మెప్పిస్తున్నది.
బమ్మెరపోతన రచించిన శ్రీమదాంధ్ర మహాభాగవతంలోని పద్యమిది - కె. లక్ష్మీఅన్నపూర్ణ