నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మ ప్రకటింపంగ సమస్త పాతకములం బాపంగ నీ పూజయం
దొక పుష్పాంశము చాలునన్న మహిలో నూహింపగా నీ పదా
ర్చకులే మార్గమునందు శుద్ధులు మదిం జర్చింప దద్గుర్గుణ
ప్రకరం బెనె్నడివాడు లోకములలో పాపిష్ఠి సర్వేశ్వరా!
భావము: సర్వేశ్వరా! అన్ని పాపాలనూ నీకు పూజ చేసిన ఒక్క పుష్పభాగమయినా పోగొట్టగలుగుతుంది. అటువంటిది నీ పాదార్చన చేసే భక్తులు ఏ రీతివారైనా శుద్ధులే, దీనిని గ్రహించక వాళ్ళ దుర్గుణాలను లెక్కించేవాడు లోకాలలో పాపాత్ముడే అవుతాడు. సర్వసాక్షి అయన ఈశ్వరుడే సర్వేశ్వరుడు. కనుక అతడికి తెలియకుండా ఏదీ ఉండదు. ఆ సర్వేశ్వరుడిని పూజిస్తున్నారంటే వారికి ఆ సర్వేశ్వర తత్వం అవగాహనకు వచ్చి ఉంటుంది. అటువంటివారికి సర్వమూ సర్వేశ్వర మయంగా భాసిస్తుంది. అంతా ఈశ్వరాంశ అయనపుడు వారిలో దుర్గణాలు మచ్చుకైనా కనిపించవు. అటువంటి వారిని వేలెత్తిచూపేవారు కేవలం తామసాంధకారులు అయఉంటారు ఆ తామసాంధత్వాన్ని దూరం చేసుకొంటే సర్వేశ్వరుని తత్త్వం మనకూ అవగాహనకు వస్తుందంటారు మన కవి.

యధావాక్కుల అన్నమయ్య రచించిన సర్వేశ్వర శతకము పద్యమిది - కె. లక్ష్మీఅన్నపూర్ణ