నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జలకంబుల్ రసముల్ ప్రసూనములు వాచాబంధముల్ వాద్యముల్
కలశబ్ద్ధ్వనులంచి తంబర మలంకారంబు దీప్తుల్ మెఱుం
గులు నైవేద్యము మాధురీ మహిమగా గొల్తున్ నినున్ భక్తి రం
జల దివ్యార్చన గూర్చి నేర్చిన క్రియన్ శ్రీకాళహస్తీశ్వరా!
భావము:శ్రీకాళహస్తీశ్వరా! శృంగారాది రసములు, పదబంధములు, శబ్ద గతములైన అవ్యక్త మధుర ధ్వనులు, అనుప్రాస, ఉపమాది అలంకారములు, ఓజోగుణ మాధుర్యములు నీకు అభిషేక జలములుగా, పూజా ప్రసూనములుగా, మంగళ వాద్యములుగా, వస్తమ్రులుగా, దీప నైవేద్యములుగా, దేవతార్చనను గురించి నేను అభ్యసించిన రీతిగా భక్తి వ్యక్తమగునట్లుగా నిన్ను సేవింతును. సామాన్యులు ప్రకృతిలో లభించిన పూలతోను శివుని సేవిస్తారు. జ్ఞానులు ఓం అనే ప్రణవనాదం జపిస్తూ శివుని సేవిస్తారు. పండితులు వారు నేర్చిన పాండితీ ప్రకర్షతో కవిత్వం అనే గంధం చల్లుతారు. పద్యాలు అనే మల్లెమొల్లలతో మాలలు కట్టి శివునికి అలంకరిస్తారు. రగడ, తరువోజ, ద్విపద లాంటి పద్య వృత్త్భేదాలతో శివుని అర్చిస్తారు. ఎవరు ఎలా తన్ను కొలిచినా వారి వారి ఆర్తిని బట్టి శివుడు వారిని అనుగ్రహిస్తాడు.

యధావాక్కుల అన్నమయ్య రచించిన సర్వేశ్వర శతకము పద్యమిది - కె. లక్ష్మీఅన్నపూర్ణ