నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కం శ్రమయెంత సంభవించిన
క్షమ మరువగ రాదు ధరణి చందంబున స
త్యమున బ్రవర్తించిన యా
రమణియె లోకమునందు రమణి కుమారీ!
భావము: కుమారీ! కష్టము ఎంత కలిగినను భూదేవి వలెను ఓర్పును మరచిపోకూడదు. సత్యముతో ప్రవర్తిస్తూ నడచుకునే స్ర్తియే ఉత్తమురాలు. భూదేవివలె శ్రమకోర్చి సహన గుణం కలిగివుండి సత్యమార్గములో నడచుకోవడం మనుష్యులకు అవసరమన్న విషయం కవి దీని ద్వారా తెలియజేశారు. మానవులెవరైనప్పటికి ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ సహనాన్ని విడిచిపెట్టకూడదనే నీతి అందిస్తున్నది ఈ పద్యం.

బక్కి వెంకట నరసింహ కవి రచించిన కుమారీ శతకములోనిది. - కె. లక్ష్మీఅన్నపూర్ణ