నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్నాయు వసావ సేక మలినమ్మగు నెమ్ము గ్రహించి జాగిలం
బాయత మోదమందు జన డాకలి దానికి జెంతనున్న గో
మాయువు దాని చూచి పరిమార్పక సింగము దంతి గూల్చనే
చాయల నెల్లవారు నిజసత్త్వ సమాన ఫలార్థులే కదా!

భావము: కుక్క మాంసరహితమై సన్నని నరాలు, కొద్దిపాటి కొవ్వు కలిగిన మలినమైన ఎముక దొరికినంతనే ఎంతో సంతోషాన్ని పొందుతుంది. కాని ఆ ఎముక దాని ఆకలిని కొంచెమైనా తీర్చదు. సింహం తన ఎదుట నక్కలు తిరుగాడుతున్నా వాటిని చంపక ఏనుగునే పట్టి చంపుతుంది. కనుక సుజనులు కష్టకాలంలో ధర్మాన్ని తప్పరు అని అట్టివారే. మంచివారి దృష్టి ఎప్పుడూ అల్పమైన విషయాలపైన వుండదు. అందరు కూడా సత్యధర్మాలపైనే దృష్టినిలపాలన్నది కవి భావం.

ఏనుగు లక్ష్మణ కవి రచించిన భర్తృహరి నీతి శతకములోనిది.- కె. లక్ష్మీఅన్నపూర్ణ