నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విద్య నిగూఢ గుప్తమగు విత్తము రూపము పూరుషాళికిన్
విద్య యశస్సు భోగకరి విద్య గురుండు విదేశ బంధుడున్
వలిద్య విశిష్ట దైవతము విద్యకు సాటి ధనంబు లేదిలన్
వలిద్య నృపాల పూజితము విద్య నెఱుంగనివాడు మర్త్యుడే

భావము:విద్య పురుషునికి రహస్యంగా దాచిపెట్టబడిన ధనం. విద్యయే సౌందర్యం. విద్యయే యశస్సునూ, భోగాలనూ కలిగిస్తుంది. విద్యయే గురువువలె అన్నింటినీ బోధిస్తుంది. పరదేశంలో చుట్టంలాగా సహాయం చేస్తుంది. విద్యయే పరదైవం. ప్రపంచంలో విద్యకు సమానమైన ధనం మరొకటి లేదు. రాజుల సభలో కూడా విద్యయే పూజింపబడుతుంది. కనుక విద్య రానివాడు అసలు మనుష్యుడేనా? మరణం కలవాడు మర్త్యుడు అనే భావాన్ని కవి తెలిపాడు.

ఏనుగు లక్ష్మణ కవి రచించిన భర్తృహరి నీతి శతకములోనిది.- కె. లక్ష్మీఅన్నపూర్ణ