నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతి తొలంగు గాత, గుణశక్తి రసాతల సీమకుం జనం
గాత కులంబు బూది యగుగాత, నగంబున నుండి శీలముం
బాతము చెందుగాత, బహు భంగుల విత్తమె మాకు మేలు వి
ఖ్యాత గుణంబు లేల దృణకల్పము తొక్క ధనంజు లేవడిన్.

భావము: జాతి భ్రష్టమైనా కానీ, గుణాలు అడుగంటిపోయినాసరే, మంచి నడవడి ఉన్నత స్థానం నుండి క్రిందకి పడిపోయి భ్రష్టమైనా కానీ, కులం తగలబడి బూడిద అయినప్పటికీ, మాకేమీ లోపం లేదు. మాకు కావలసింది, మేలు కలిగించేది ధనం. అది ఒక్కటి ఉంటే చాలు. అది లేని పక్షంలో పైన పేర్కొన్న ఇతర గుణాలన్నీ కూడా మాకు గడ్డిపోచతో సమానం. ‘్ధనం మూలం ఇదం జగత్’ అనే విషయాన్ని ఈ పద్యం స్పష్టం చేస్తున్నది. లోకంలో ధనానికి మించినవి మరేవీ లేవు అని భావము.

ఏనుగు లక్ష్మణ కవి రచించిన భర్తృహరి నీతి శతకములోనిది.- కె. లక్ష్మీఅన్నపూర్ణ