నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒక యెడ బవ్వళించు హరి, యొక్కయెడన్ వహియించు రాక్షస
ప్రకరము, లొక్కచో నడగు బర్వత సంఘము, లొక్కెడన్ బలా
హకములతోడ నుండు బడబాగ్నియు, విస్తృత మూర్జితంబునుం
బ్రకటభరక్షమం బగుచు భాసిలు నౌర సముద్రమెంతయున్
భావము:- సముద్రము అనేకవిధాలుగా ఆశ్చర్యజనకంగా వుంటుంది. ఎలా అంటే సముద్రం ఒకవైపు పధ్నాలుగు లోకాలను తన కడుపులో ధరించిన విష్ణుమూర్తి నిద్రించడానికి స్థానమిస్తుంది. వేరొక ప్రక్క విష్ణుమూర్తికి శత్రువైన కాలకేయాదులకు కూడా స్థానమిస్తుంది. ఒక వంక ఇంద్రునినుండి తమను కాపాడుకోవడానికి వచ్చిన మైనాకాది పర్వతాలనూ ధరిస్తుంది. మరోవైపు ప్రళయ కాలమేఘాలతో కూడిన బడబాగ్ని నీటిని ఎంతగా పీలుస్తున్నా అంతగా వర్ధిల్లుతుంది. ఈ విధంగా మహాత్ములు ఎందరికో ఆశ్రయాన్ని కల్పిస్తారు.
ఏనుగు లక్ష్మణ కవి రచించిన భర్తృహరి నీతి శతకములోనిది.- కె. లక్ష్మీఅన్నపూర్ణ