నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆశాసంహరణంబు, నోర్మియు మదత్యాగంబు, దుర్దోషవాం
ఛాశూన్యత్వము, సత్యమున్, బుధమతాచారంబు, సత్సేవయున్
వైశద్యంబును, శత్రులాలనము, మాన్యప్రీతియుం, బ్రశ్రయ
శ్రీ శాలిత్వము, దీనులందు కృపయున్, శిష్టాలికిన్ ధర్మముల్

భావము:- అత్యాశను వదిలిపెట్టడం, ఓర్పు కలిగి వుండడం, మదాన్ని వీడడం, పాప కార్యాలపై కోరికలు లేకుండడం, సత్యానే్న పలకడం, పండితులు నడిచిన మార్గంలోనే నడవడం, సజ్జనులను సేవించడం, సంపద కలిగి వుండడం, శత్రువులనైనా చక్కగా చూడడం, పూజ్యులను పూజించడం, పెద్దల యెడ అణకువ కలిగివుండడం, దుఃఖితుల యెడ దయ చూపడం ఇవన్నీ సత్పురుషులలో వుండే లక్షణాలు.
ఏనుగు లక్ష్మణ కవి రచించిన భర్తృహరి నీతి శతకములోనిది.- కె. లక్ష్మీఅన్నపూర్ణ