నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క. అనఘా! రుూ యజ్ఞము విధి
సనాథ ఋత్విక్ ప్రయోగ సంపూర్ణం బ
య్యును గడచన నేరదు నడు
మన యుడుగును భూసురోత్తమ నిమిత్తమునన్
భావం: పుణ్యాత్మడవైన జనమేజయా! నీవు చేయబోయే రుూ యజ్ఞం ఋత్విక్కులు శాస్త్రోక్తంగా చేసే క్రియాకలాపం చేత సమగ్రమైనప్పటికినీ చివరిదాకా సాగదు. ఒక బ్రాహ్మణోత్తముని కారణంగా మధ్యలోనే ఆగిపోతుంది.
జనమేజయుడు సర్పయాగాన్ని చేయడానికి నిశ్చయించుకొన్నాడు. అపుడు జనమేజయుడు బ్రాహ్మణోత్తముల సాయంతో పురాణాలల్లో చెప్పబడిన కొలతల ప్రకారం యజ్ఞశాలను నిర్మించారు. ఆ యజ్ఞశాల నిర్మాణంలో యజ్ఞానికి కావలసిన యజ్ఞసంబరాలు, ధనమూ, ధాన్యము, వివిధ వస్తుసముదాయాలు , ఋత్వికులు ఉండడానికి కావలసిన వసతి, వారి యజ్ఞసంబరాలు నిల్వ ఉంచుకునే స్థలమూ ఇతరత్రావాటితో నిండిన ఆ యాగశాలలో ఉన్న జనమేజయుడ్ని చూచిన ఓ గృహనిర్మాణనైపుణ్యమున్న ఓ బ్రాహ్మణుడు జనమేజయుడ్నిచూచి ‘ఓరాజా! నీవు ఇంత శ్రమపడి చేయబోయ యాగం ఒక్క బ్రాహ్మణోత్తముని వలన సగంలోనే ఆగిపోతుంది’ అని భవిష్యత్తు గురించిన సమాచారాన్ని చెప్పాడు.

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము