నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నీతి ప్రౌఢ విహారులైన నిపుణుల్ నిందింపనీ మెచ్చనీ
ఖ్యాతిం జెందిన సంపదల్ నిలవనీ గాఢంబుగా సాగనీ
ఘాతం బపుడ పొందనీ నియతియై గానీ యుగాంతంబునన్
నీతి శ్లాఘ్య పదంబు దప్పరు గదా నిత్యంబు ధీరోత్తముల్

భావము:్ధరులైనవారు తాము నమ్ముకున్న మంచి మార్గంలోనే పోతూ వుండగా కొందరు ఆ మార్గం తప్పని నిందించవచ్చు. మరికొందరు మంచి మార్గమని పొగడవచ్చు. ధీరుడు ఈ నిందాస్తుతులను లెక్కచేయడు. సంపదలు రానూ వచ్చు, ఉన్న సంపదలు పోనూ వచ్చు. ధీరుడు ఈ రెండింటినీ లెక్కచేయడు. తాను న్యాయమార్గంలో నడుస్తున్నపుడు ఒకప్పుడు వెంటనే మరణం సంభవించవచ్చు లేదా కల్పాంతరంలోనైనా కలుగవచ్చు. ధీరుడు వీటిని లెక్కచేయడు. మంచి వచ్చినా, చెడు వచ్చినా లెక్కచేయక ధీరుడు న్యాయమార్గాన్ని విడిచిపెట్టడు.

ఏనుగు లక్ష్మణ కవి రచించిన భర్తృహరి నీతి శతకములోనిది.- కె. లక్ష్మీఅన్నపూర్ణ