నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క. తడఁబడ బడియెడు రవమును
బడి కాలెడు రవముఁ గాని గాలి పలుదెఱఁగుల ప్ర
స్సెడు రవమును దిగ్వలయముఁ
గడుగొని మ్రోంచి నురగకాయోర్థిత మై
భావం: తొట్రు పాటు పడుతూ అగ్నిలో పడేటప్పుడు కలిగే ధ్వనియున్నూ, పడి కాలే ధ్వనియున్నూ కాలి పెక్కు విధాల బ్రద్ధలయ్యేప్పుడు కలిగే ధ్వనియున్నూ పాముల దేహాల నుండి బయల్వడినవై దిక్ చక్రాన్ని అతిశయంగా మ్రోగేటట్లు చేశాయి.
జనమేజయుడు తన పూర్వుల చరిత్ర తెలుసుకొన్న తర్వాత చేస్తున్న సర్పయాగంలో బ్రాహ్మణుల మంత్రాల వలన ఎక్కడెక్కడి నుంచో పాములన్నీ పరుగెత్తుకు వచ్చి ఒక్కొక్కటిగా పడిపోతున్నాయి. అలా పడిన పాములు చనిపోయే టప్పుడు వాటినుంచి వెలువడే ధ్వనులు ఇతర పాములకు భయప్రకంపనలుకలిగిస్తూ వున్నాయి. చూసేవారి మనసులు కూడా ఎంత ప్రభావవంతమైన మంత్రాలో, యాగమో కదా అన్న సంభ్రమాశ్చర్యాలతో చూస్తున్నారు.

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము