నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శిథిలత లేని భక్తి నతి సేయుదు వేల్పుల కాసుపర్వులున్
విధివశ్వర్తు, లావిధియు విశ్రుత కర్మ ఫల ప్రదాత, య
య్యధిక ఫలంబు కర్మవశ, మట్లగుటం బనియేమి వారిచే
విధి కధికంబు కకర్మమని వేమఱు మ్రొక్కి భజించు కర్మమున్

భావము: ఆ దేవతలకు అత్యంత భక్తిపూర్వక నమస్కారము. దేవతలు కూడా విధి అధీనములో వుండువారు అనగా దైవానికి లోబడినవారే కనుక వారికి నమస్కరిస్తాను. ఆ దైవం కూడా కర్మానుసారంగానే ఫలాన్ని ఇస్తుంది. ఆ ఫలం కూడా కర్మాధీనమే. కనుక దేవతలతోను, దైవంతోనూ నాకేమి పని? విధికన్నా కర్మమే గొప్పది కనుక ఆ కర్మనే నమస్కరించి సేవిస్తాను. ప్రతి మానవుడు తాను చేసుకున్న కర్మల ఫలితానే్న అనుభవిస్తాడు. కాబట్టి విధికన్నా కర్మే గొప్పదని కవి భావించాడు.

ఏనుగు లక్ష్మణ కవి రచించిన భర్తృహరి నీతి శతకములోనిది.- కె. లక్ష్మీఅన్నపూర్ణ