నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క. ఉదర భిదాముఖమున న
భ్యుదయములతో నిర్గమించె బుధసుతుఁడు కడుం
డుదయాద్రిదరీ ముఖమున
నుదితుం డగు పూర్ణ హిమమయూఖుఁడ పోలెన్

భావం: తన లోపల నున్న కచుడు తిరిగి బయట ప్రపంచంలోకి రావాలంటే తన ఉదరానే్న చీల్చుకొని రావాలి. కాని మరో మార్గం లేదు. అట్లా వస్తే తాను ప్రాణాలను కోల్పోవలసి ఉంటుంది. ఇట్లా కాకుండా ఇద్దరూ గురుశిష్యులిద్దరూ బతికి ఉండాలంటే తాను ముందు కచునికి మృత సంజీవని విద్యను బోధించాలని అనుకొన్నాడు. అన్నీ ఆలోచించి కచునకు శుక్రుడు సంజీవని విద్యను ఉపదేశించాడు. ఇక అపుడు పండితులచే స్తుతించబడు కచుడు వాంఛితార్థ సిద్ధితో తూర్పు కొండగుహ యొక్క ఆరంభాన ఉదయించే చంద్రుడి వలె శుక్రుడి కడుపు రంధ్రం మొదటి నుండి బయటకు వచ్చాడు.

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము