నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నరసింహ శతకం
*
సీ॥ సాధుసజ్జనులతో జగడ మాడినఁగీడు
కవులతో వైరంబుఁ గాంచఁ గీడు
పరమదీనులఁజిక్కఁబట్టి కొట్టినఁ గీడు
భిక్షుకులను దుఃఖపెట్టఁగీడు
నిరుపేదలను జూచి నిందఁజేసినఁగీడు
పుణ్యవంతులఁదిట్ట బొసగుఁ గీడు
సద్భక్తులను దిరస్కారమాడినఁగీడు
గురునిద్రవ్యము దోచుకొనినఁగీడు
తే॥ దుష్టకార్యము లొనరించు దుర్జనులకు
ఘనతరంబైన నరకంబు గట్టుముల్లె
భూషణవికాస! శ్రీ్ధర్మపుర నివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర!
*
భావం: ఓ తండ్రీ! మంచివారితో దెబ్బలాడినా, కవులతో విరోధం పెట్టుకున్నా, దీనుల్ని కొట్టినా, యాచకుల్ని ఏడ్పించినా, నిరుపేదల్ని నిందించినా, పుణ్యాత్ములైన భక్తుల్ని తూలనాడినా, గురువుల సొమ్ము అపహరించినా కీడు తప్పదు. చెడ్డ పనులు చేసే దుష్టులకు నరకమే గట్టిముల్లె.