నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నరసింహ శతకం
*
సీ॥ నరసింహ! నాతండ్రి ననే్నలు ననే్నలు
కామితార్థములిచ్చికావు కావు
దైత్య సంహర! చాల దయయుంచు దయయుంచు
దీనపోషక! నీవె దిక్కు దిక్కు
రత్నభూషితవక్ష! రక్షింపు రక్షింపు
భువనరక్షక! నన్నుఁ బ్రోవు బ్రోవు
మారకోటి స్వరూప! మన్నించు మన్నించు
పద్మలోచన! చేయి పట్టు పట్టు
తే॥ సురవినుత! నేను నీచాటు జొచ్చినాను
నా మొఱాలించి కడతేర్చు నాగశయన!
భూషణవికాస! శ్రీ్ధర్మపురనివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర!

భావం: నరసింహస్వామీ! నీవు నాకు జన్మనిచ్చిన తండ్రివి. నేనుఁ గోరిన సంపదలిచ్చి నన్ను కాపాడు. నాపై కరుణజూపు. దీనవత్సలుడవైన నీవే నాకు దిక్కు. నీది రత్నభూషిత వక్షఃస్థలం. నీవే నన్ను రక్షించాలి. లోకాలన్నింటిని కాపాడేవాడవు నీవే. నన్ను దగ్గర చేర్చుకో. కోటి మన్మథులంత అందగాడివి నీవు. నన్ననుగ్రహించు. పద్మాక్షా! నా చేయి పట్టుకుని నన్ను నడిపించు. నిన్నాశ్రయించిన వాణ్ణి. నా మొర ఆలకించి నా కష్టాల్ని నివారించు.