నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీ॥ పంజరంబునఁ గానిఁ బట్టియుంచిన లెస్స
పలుకునే వింతైన చిలుకపలుకు
గార్ధ్భంబును దెచ్చి కళ్లెమింపుగ వేయ
తిరుగునే గుఱ్ఱంబు తీరుగాను
ఎనుపపోతును మావటటీడు శిక్షించిన
నడచునే మదవారణంబు వలెను
పెద్ద పిట్టకు మేతఁబెట్టి పెంచినఁగ్రొవ్వి
సాగునే వేటాడు డేగవలెను
తే॥ కుజనులను దెచ్చి నీ సేవకొరకుఁ బెట్ట
వాంఛతోఁజేతురే భక్తవరుల వలెను
భూషణవికాస! శ్రీ్ధర్మపుర నివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర!

భావం: ఓ నరసింహ ప్రభూ! కాకిని పంజరంలో బంధిస్తే, అది చిలుక పల్కులు పల్కుతుందా? గాడిదకు కళ్లెం తగిలిస్తే అది గుఱ్ఱం లాగా తిరుగుతుందా? దున్నకు మావటివానిచే శిక్షణ ఇప్పిస్తే, మదపుటేన్గులా నడుస్తుందా? పెద్దపిట్టకు మేత పెడితే డేగలాగ కొవ్వెక్కి సాగుతుందా! ఇలాగే దుష్టుణ్ణి నీ సేవకు పెడితే, సద్భక్తుని లాగా ప్రీతితో సేవ చేస్తాడా! చేయడని తాత్పర్యం.