నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీ॥ నిగమాది శాస్తమ్రుల్ నేర్చిన ద్విజుఁడైన
యజ్ఞకర్తగు సోమయాజియైన
ధరణిలోపల ప్రభాతస్నానపరుఁడైన
నిత్యసత్కర్మాది నిరతుఁడైన
నుపవాస నియమంబు నొందు సజ్జనుఁడైన
గాని వస్తమ్రుఁగట్టు ఘనుఁడునైన
దండి షోడశ మహదానపరుండైన
సకల యాత్రలు సల్పు సరసుఁడైన
తే॥ గర్వమునఁగష్టపడి నిన్నుఁ గానకున్న
మోక్షసామ్రాజ్యమొందఁడు మోహనాంగ!
భూషణవికాస శ్రీ్ధర్మపుర నివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర!
భావం: ఓ ప్రభూ! వేదశాస్త్రాల్ని అభ్యసించిన బ్రాహ్మణుడైనా, యజ్ఞయాగాలు చేసే సోమయాజియైనా, ఉదయకాల స్నానకృత్యం నిర్వర్తించేవాడైనా, నిత్యం సత్కర్మలే చేసేవాడైనా, ఉపవాస వ్రతాలు చేసేవాడేయైనా, కాషాయాంబరాలు తాల్చే సన్న్యాసేయైనా, పదహారు రకాల దానాలు చేసేవాడైనా, పుణ్యతీర్థ క్షేత్రాలు తిరిగే పుణ్యాత్ముడేయైనా, పొగరుపోతై నిన్ను సేవించకపోతే ముక్తినొందడు.