నేర్చుకుందాం

నరసింహ శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నరసింహ శతకం
*
సీ॥ అతిలోభులను భిక్షమడుగఁ బోవుట రోత
తనద్రవ్యమొకరింట దాచ రోత
గుణహీనుఁడగువాని కొలువు గొల్చుట రోత
యొరుల పంచలక్రింద నుండ రోత
భాగ్యవంతుల తోడఁ బంతమాడుట రోట
గుఱిలేని బంధుఁలగూడ రోత
ఆదాయములు లేక అప్పుదీయుట రోత
జారచోరులఁ గూడ చనుట రోత
తే॥ ఆది లక్ష్మీశ! నీ బంటు నయితినయ్య!
యింక నెడఁబాపు జన్మ యిదెన్న రోత
భూషణవికాస! శ్రీ్ధర్మపుర నివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూత!
*
భావం: ఓ ప్రభూ! పిసినిగొట్టిని బిచ్చమడగటం, పరుల వద్ద సొమ్ము దాచటం, గుణహీనుని కొలువు కొలవటం, ఇతరుల పంచగాయటం, ధనవంతులతో తగవులాడటం, విశ్వాసంలేని బంధువుల్ని చేరబోవటం, వనరులు లేకుండ అప్పుచేయటం, వ్యభిచారులతో, దొంగలతో కలిసి తిరగటం - ఇవన్ని నీచపు పనులు. ఓ లక్ష్మీనాథా! నేను నీ సేవకుణ్ణి. నాకు ముక్తిని ప్రసాదించు - మళ్లీ పుట్టటం రోతసుమా!