నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నరసింహ శతకం

సీ॥ సకల విద్యలు నేర్చి సభ జయింపఁగ వచ్చు
శూరుఁడై రణమందుఁ బోరవచ్చు
రాజరాజైపుట్టి రాజ్యమేలఁగ వచ్చు
హేమగోదానంబు లియ్యవచ్చు
గగనమందున్న చుక్కల నెంచఁగా వచ్చు
జీవరాసుల పేళ్లు చెప్పవచ్చు
సాష్టాంగ యోగము లభ్యసింపఁగ వచ్చుఁ
గఠినవౌ రాల మ్రింగంగవచ్చు
తే॥ దామరసగర్భ! హరిపురందరులకైన
నిన్ను వర్ణింపఁ దరవౌనె నీరజాక్ష!
భూషణవికాస శ్రీ్ధర్మపుర నివాస
దుష్టసంహార! నరసింహ! దురితదూర!

భావం: విద్యలన్నింటిని నేర్చుకొని సభలలో నెగ్గవచ్చు. పరాక్రమశాలియై యుద్ధాలు చేయవచ్చు. రారాజై రాజ్యమేలవచ్చు. బంగారాన్ని, ఆవుల్ని దానం చేయవచ్చు. ఆకాశంలోని చుక్కల్ని లెక్కపెట్టవచ్చు. 84 లక్షల జీవరాసుల పేర్లు చెప్పవచ్చు. అష్టాంగ యోగాలభ్యసించవచ్చు. కరుకైన రాళ్లు మ్రింగవచ్చు. కాని బ్రహ్మ విష్ణువు హేంద్రాది దేవతలకైనా నిన్ను వర్ణింపనలవిగాదు.