నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉ. అనహుషాత్మజుండగు యయాతి యధిజ్యధనునృప హాయుఁడై
యానత శాత్రవుండు మృగయా రస లో ల నిబద్ద బుద్ధి ఁద
త్యానన మెల్లఁ గ్రుమ్మఱి నికా సుధృతశ్రము ఁడేగు దెంచె నం
దానలినాక్షి యున్న విపినాంతర కూప తటంబు నొద్దకున్

భావం: తాను కట్టుకున్న వస్త్రాలు కట్టుకోనంటూ కోపగించిన దేవయానిని నేను కట్టుకొన్న వస్త్రాలు నీవు కట్టుకోరాదా ఏమిటి అని నిందలాడి దేవయానిని ఒక నూతిలో త్రోసివేసి శర్మిష్ఠ వేయిమంది తన చెలికత్తెలతో కలసి తిరిగి తన గృహానికి వెళ్లిపోయింది. ఆతరువాత అక్కడికి ఓడించబడి విధేయులైన శత్రువులు కల ప్రసిద్ధుడైన నహుషుడి కుమారుడైన యయాతి మహారాజు వేట అనే వినోదమందు ఆసక్తి గల బుద్ధి గలవాడై ఆ అడవి అంతా తిరిగి అధికంగా పొందబడిన శ్రమ కలవాడై అక్కడ దేవయాని పడియున్న అడివి మధ్యలోన నూతి గట్టు దగ్గరకు వచ్చాడు.

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము