నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నరసింహ శతకం
*
సీ॥ వాంఛతో బలిచక్రవర్తి దగ్గరఁజేరి
భిక్షమెత్తితివేల బిడియపడక!
అడవిలో శబరి తీయని ఫలాలందియ్యఁ
జేతులొగ్గితివేల సిగ్గుపడక!
వేడ్కతో వేవేగ విదురు నింటికి నేగి
విందుగొంటివదేమి వెలితి పడక?
అడుకులల్పము కుచేలుఁడు గడించుకుఁ దేఁగ
బొక్కసాగితివేల లెక్కఁగొనక?
తే॥ భక్తులకు నీవు పెట్టుట భావ్యవౌను
వానినాశించితివి తిండివాడఁవగుచు
భూషణ వికాస! శ్రీ్ధర్మపుర నివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర!
*
భావం - ఓ స్వామీ! కోరికోరి బలిచక్రవర్తి వద్దకు వెళ్లి నిస్సందేహంగా బిచ్చమెత్తావెందుకు? శబరి తియ్యని పండ్లిస్తే సిగ్గువిడిచి చేయి చాపావు. విదురునింటికి పోయి విందారగించావు. కుచేలుడు అటుకులు తెస్తే నమిలావు. మామూలుగానైతే నీవుగదా భక్తులకివ్వాలి? అది మానుకొని తిండిపోతువై వారిచ్చింది గ్రహించావు - ఇది చాల విచిత్రం.