నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నరసింహ శతకం
*

సీ॥ ఇభకుంభముల మీఁద కెగిరెడి సింగంబు
ముట్టునే కుఱుచైన మూషికమును?
నవచూతపత్రముల్ నములుచున్న పికంబు
కొఱుకునే జిల్లేడు కొనలు నోట?
అరవింద మకరంద మనుభవించెడి తేటి
పోవునే పల్లేరు పూలకడకు?
లలితమైన రసాల ఫలముఁ గొర్కెడి చిల్క
మెసవునే భ్రమత నుమ్మెత్తకాయ?
తే॥ ఇలను నీ కీర్తనలు పాడ నేర్చినతఁడు
పరులకీర్తనఁ బాడునే యరసి చూడ
భూషణవికాస! శ్రీ ధర్మపుర నివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర!

భావం: ఓ నరసింహప్రభూ! ఏనుగు గండస్థలంపైకి ఎగబ్రాకే సింహం చిట్టెలుకని పట్టుకోదు. లేమావిచిగుళ్లు కొరికే కోకిల జిల్లేడు కొనల నాసించదు. తామరలోని తేనె జుఱ్ఱుకునే జుంటీగె పల్లేరు పూలపై వ్రాలదు. మామిడిపళ్లు తినే చిలుక ఉమ్మెత్త కాయల్ని తినదు. అయినా సదా నీ కీర్తనల్ని ఆలాపించే భక్తులు అన్య కీర్తనల్ని ఆలాపించరు.