నేర్చుకుందాం

నరసింహ శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీ॥ ఇహలోక సౌఖ్యము లిచ్చగించెదమన్న
దేహమెప్పటికిని స్థిరతనొంద
దాయుష్యమున్న పర్యంతంబు పటుతయు
నొక్కతీరుననుండ దుర్విలోన
బాల్యయువత్వదుర్బల వార్థకములును
మూటిలో మునిగెడి మురికికొంప
భ్రాంతితో దీనిఁ గాపాడుదమనుకొన్నఁ
గాలమృత్యువుచేతఁ గోలుపోవు
తే॥ నమ్మరాదయ్య! ఇది మాయనాటకంబు
జన్మమికనొల్ల ననే్నలు జలజనాభ!
భూషణవికాస! శ్రీ్ధర్మపుర నివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర!
భావం: ఓ నరసింహస్వామీ! ఈ ప్రాపంచిక సుఖాల్ని ఆశిద్దామనుకుంటే, దేహం శాశ్వతమైందిగాదు. ఇది బాల్యం, వనం, వార్థక్యవనే మూడింటితో కొట్టుమిట్టాడే మురికికొంప. దీన్ని కాపాడుకుందాం లెమ్మనుకుంటే ఏనాడో ఒకనాడు ఇది అనుకోకుండా మృత్యువాత పడుతుంది. ఈ జీవితం మాయానాటకం. దీన్ని నమ్మరాదు. ఇక నాకు జనే్మవద్దు. నన్ను కాపాడు తండ్రీ!