పెరటి చెట్టు

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నరసింహ శతకం
*
సీ॥ తార్‌క్ష్యవాహన! నీవు దండిదాతవటంచుఁ
గోరి వేడుక నిన్నుఁ గొల్వవచ్చి
యర్థిమార్గమును నే ననుసరించితినయ్య
లావైన పదునాల్గు లక్షలైన
వేషముల్ వేసి నా విద్యా ప్రగల్భతఁ
జూపసాగితి నీకు సుందరాంగ!
ఆనందమైన నే నడుగ వచ్చిన దిచ్చి
వాంఛఁదీర్చుము నీలవర్ణ! వేగ

తే॥ నీకు నా విద్య హర్షంబు గాకయున్న
తేపతేపకు వేషముల్ దేను జుమ్మి!
భూషణవికాస! శ్రీ్ధర్మపుర నివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర!
*
భావం: ఓ స్వామీ! నీవు గరుడవాహనుడవు. మరియు గొప్ప దాతవని నమ్మి నిన్ను యాచక పద్ధతిలో సేవింపవచ్చాను. నేను నైపుణ్యంతో పెక్కు వేషాలు ప్రదర్శిస్తున్నాను. ఇవి సంతోషాన్ని గల్గిస్తే, నేను కోరిన కోర్కెల్ని నెరవేర్చు - నేనడిగింది ఇవ్వు. నా విద్య నచ్చకపోతే, ఇంక మాటిమాటికి ఈ వేషాలు కట్టను.