నేర్చుకుందాం

నేర్చుకుందాం( నరసింహ శతకం )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీ॥ అందరేమైన నిన్నడుగవచ్చెదరంచు
క్షీరసాగరమందుఁ జేరినావు,
నీ చుట్టు సేవకుల్ నిలువకుండుటకునై
భయదసర్పముమీఁదఁ బండినావు
భక్తబృందము వెంటఁబడి చరించెదరంచు
నెగిరిపోయెడి పక్షినెక్కినావు
దాసులు నీ ద్వారమాసింపకుంటకై
మంచి యోధుల కాపునుంచి నావు
తే॥ లావుగలవాఁడవైతి వేలాగు నేను
నిన్నుఁ జూతును? నా తండ్రి! నీరజాక్ష!
భూషణవికాస! శ్రీ్ధర్మపుర నివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర!

భావం: ఓ ప్రభూ! నీ భక్తులేమైనా అడగటానికి వస్తారేమో అని పాలసంద్రం చేరావు. నీ చుట్టూ సేవకులు నిలువకుండా ఉండటానికి పెద్ద సర్పంపై పడుకున్నావు. భక్తులు వెంటబడతారని తలంచి వారికి చిక్కకుండటానికి గద్ద (గరుత్మంతుని) నెక్కావు. భృత్యులు నీ గడప తొక్కకుండ నుండటానికి జయవిజయులనే ద్వారపాలుర్ని కాపలా పెట్టావు - ఇంత బలాఢ్యుడవయ్యావు గదా! నినె్నలా చూడగలను తండ్రీ!