నేర్చుకుందాం

నేర్చుకుందాం( నరసింహ శతకం )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీ॥ దనుజ సంహర! చక్రధర! నీకు దండంబు,
ఇందిరాధిప! నీకు వందనంబు,
పతితపావన! నీకు బహు నమస్కారముల్,
నీరజాతదళాక్ష! నీకు శరణు,
వాసవార్చిత! మేఘవర్ణ! నీకు శుభంబు,
మందరధర! నీకు మంగళంబు
కంబుకంధర! శార్‌ఙ్గకర! నీకు భద్రంబు
దీనరక్షక! నీకు దిగ్విజయము
తే॥ సకల వైభవములు నీకు సార్వభౌమ!
నిత్యకళ్యాణములు నగు నీకు నెపుడు,
భూషణ వికాస! శ్రీ్ధర్మపుర నివాస!
దుష్టసంహార! నరసింమ! దురితదూర!

భావం: ఓ నరసింహ స్వామీ! రక్కసుల్ని చంపిన నీకు నమస్కారం. లక్ష్మీనాథా! నీకు వందనం. పాపుల్ని రక్షించు ప్రభూ! నీకు నమస్కృతులు. పద్మదళాక్ష! నీకు శరణు, ఇంద్రపూజిత! మేఘవర్ణ! నీకు శుభం. మందరగిరిధారీ! నీకు మంగళమగుగాక. శంఖం వంటి గొంతుగల స్వామీ! ధనుర్ధారీ! నీకు భద్రమగుగాక. దీనజనరక్షకా! నీకు విజయమగుగాక. మహారాజా! నీకెల్లప్పుడూ కళ్యాణమగుగాక - సకల సంపదలు కలుగుగాక.