నేర్చుకుందాం

నరసింహ శతకం -- నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీ॥ లక్ష్మీశ! నీ దివ్య లక్షణ గుణములు
వినఁజాలకెప్పుడు వెఱ్ఱినైతి
నా వెఱ్ఱి గుణములు నయముగా ఖండించి
నన్ను రక్షింపుమో నళిననేత్ర!
నిన్ను నే నమ్మితి నితరదైవముల నే
నమ్మ లేదెప్పుడు నాగశయన!
కాపాడినను నీవె కష్టపెట్టిన నీవె
నీ పాద కమలముల్ నిరతమేను
తే॥ నమ్మియున్నాను నీ పాదనళినభక్తి
వేగ దయచేసి రక్షించు వేదవేద్య!
భూషణ వికాస! శ్రీ్ధర్మపుర నివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర!

భావం: ఓ నరసింహస్వామీ! శ్రీదేవి మగడవైన నీ దివ్య గుణాల్ని ఎప్పుడూ విననందువల్ల పిచ్చివాణ్ణయ్యాను. ఆ పిచ్చిగుణాల్ని పోగొట్టి కాపాడు. ఓ పద్మనేత్రా! నేను నిన్ను తప్ప మరెవ్వరిని ఏనాడూ నమ్మలేదు. కాపాడినా, కష్టపెట్టినా నీదే భారం. నీ పాదపద్మాల్ని సదా నమ్ముకున్నాను. నీ పాదార్చననే నాకు అనుగ్రహించి రక్షించు దేవా!