నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దాశరథి శతకం
*
చ.గురుతరమైన కావ్యరసగుంభన కబ్బురమంది ముష్కరుల్
సరసులమాడ్కి సంతసిలఁ జాలుదురోటు శశాంకచంద్రికాం
కురములకిందుకాంతమణికోటి స్రవించినభంగి వింధ్యభూ
ధరమున జారునే శిలలు? దాశరథీ కరుణాపయోనిధీ.
భావం: చంద్రుని కిరణాలు ప్రసరించినప్పుడు, చంద్రకాంతమణులచే శ్రేష్ఠమైన మణులు కరిగి జాలువారునని కవి సంప్రదాయం. చంద్రుని వెనె్నలలో చంద్రకాంతమణులు కరిగే విధంగా, వింధ్య పర్వతంలో ఉండే బండరాళ్లు కరిగి జాలువారునా? కరగవు కదా. ఆ విధంగానే కావ్యంలో ఉండే శృంగారాది రసస్ఫూర్తికి, రసము విలువ తెలిసిన వారి వలె, మూర్ఖులైనవారు, కుటిలురు, అబ్బురపడి సంతోషింపజాలరు. ఆ విలువ తెలిసికొనలేక భంగపడుతారు. అందుచేత ఈ కావ్యాన్ని సరసుడవైన నీకు అంకితం చేస్తూ ఉన్నాను దయాసముద్రుడవైన దశరథరామా.
వ్యా: గురువు అనే పదానికి, ఉపాధ్యాయుడు, బృహస్పతి, కులముపెద్ద, తండ్రి, తాత, అన్న, మామ, మేనమామ, రాజు, కాపాడువాడు, అలఘువు, గొప్పది అనే అర్థాలున్నాయి. రసనిర్భరమైన కావ్యం చాల గొప్పది అనే భావం కలిగినవాడీ కవి కాబట్టి తన కావ్యం అటువంటిదని భావించినవాడు కాబట్టి దానికి ‘గురుతర’ అనే విశేషణం ప్రయోగించినాడు. ఇక్కడ రసగుంభనము అంటే, విభిన్న కావ్య రసములను ఉచితరీతిని కూర్చుట అని భావము. దీనివలన కావ్యానికి సౌందర్యం సమకూరుతుంది.
చంద్రకాంత శిలలున్నాయని, అవి చంద్రిక కాచినప్పుడు ద్రవిస్తాయని కవులు చెప్పడమే కాని, శాస్తబ్రద్ధంగా దానికి ప్రమాణం లేదు. వెనె్నల ప్రసరించినప్పుడు సామాన్యంగా చల్లని వాతావరణం ఏర్పడుతుంది. దానివలన చలువరాళ్ల వంటి తెల్లని రాళ్లపై, మంచుబిందువులు చేరవచ్చు (రాత్రిపూట) దాన్ని చూచిన కవులు అవి ద్రవించినాయని అతిశయోక్తిగా భావించి ఉండవచ్చు. అదే కవి సమయంలాగా ప్రచలితం కావచ్చును.