నేర్చుకుందాం

నేర్చుకుందాం-- దాశరథి శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చ.పరమదయానిధే పతితపావననామ, హరే యటంచు సు
స్థిరమతులై సదా భజనచేయు మహాత్ముల పాదధూళి నా
శిరమునఁ దాల్తు మీరటకుఁ జేరకుఁడంచు యముండు కింకరో
త్కరముల కానబెట్టునట, దాశరథీ కరుణాపయోనిధీ.
భావం: దయాగుణ సంపన్నుడివైన ఓ దశరథరామా, అడుగున పడిన పాపాత్ములను ఉద్ధరించి పవిత్రులను చేసే పేరు ప్రఖ్యాతి కలిగిన ఓ రామా, హరీ అని ఎల్లప్పుడు, మిక్కిలి నిలకడ కలిగిన మనస్సు గలవారలు, అనగా చంచలత్వము లేని మనస్సు గలవారలు, నిన్ను భజించు మహనీయుల పాదధూళిని నా తలపై ధరింతును. దానివలన, మీరు అట్టివారి యొద్దకు, వెళ్లవద్దని మృత్యుదేవతయైన యముడు, తన సేవకులను ఆజ్ఞాపిస్తాడని చెప్పుదురు. అనగా, విష్ణునామ సంకీర్తన చేసేవారిని స్మరించి, వారి పాదాలకు నమస్కరించేవారిని సమీపించడానికి మృత్యువు కూడా భయపడుతుందని కవి భావము.
వ్యా: విశిష్టాద్వైత సంప్రదాయంలో భాగవతసేవ అనేది ఒక ముఖ్యభాగం. భాగవతులు అంటే భగవద్భక్తులు. ఆ భగవద్ధుక్తులైన వారిని సేవిస్తే, నారాయణుని సేవ చేసినట్లే నారాయణుని తృప్తిపరచినట్లే అని వైష్ణవులు భావిస్తారు. మహేశ్వరుడు ప్రథమ భాగవతోత్తముడని కదా ప్రతీతి. అటువంటి మహేశ్వరుని సదా ధ్వానించి మార్కండేయుడు మృత్యువును తప్పించుకొన్న కథ భగత్ప్రఖ్యాతమైంది కదా.
విష్ణు భక్తులకు సేవ చేసిన వారిని యమకింకరులు సమీపించరు అని కవి చెప్పడం ఇటువంటి ఐతిహ్యాన్ని మనస్సులో పెట్టుకొన్నదే.