నేర్చుకుందాం

నేర్చుకుందాం -- దాశరథి శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చ.అజునకుఁ దండ్రివయ్యు, సనకాదులకుం బరతత్త్వమయ్యు, స
ద్ద్విజముని కోటికెల్లఁ గులదేవతవయ్యు, దినేశవంశభూ
భుజులకు మేటివయ్యు, బరిపూర్ణుఁడవై వెలుఁగొందు పక్షిరా
డ్ద్వజ, మిముఁ బ్రస్తుతించెదను, దాశరథీ, కరుణాపయోనిధీ.
భావం: బ్రహ్మకు నీవు తండ్రివి. సనకసనందనాది విష్ణ్భుక్తులకు నీవు భగవంతుడవు. చక్కని నడవడి కలిగిన బ్రాహ్మణులకు, ఋషులకు, మునులకు ఉత్కృష్టమైన దైవమువు. సూర్యవంశంలో జన్మించి, లోకాన్ని పరిపాలించిన రాజులందరిలో ముఖ్యమైనవాడవు. ఇన్ని మంచి గుణాలు కలిగిన నీవు నిండైనవాడవు. లోపము లేనివాడవు. అట్టి నిన్ను స్తోత్రం చేస్తాను, ఓ దశరథరామా!
వ్యా: భగవంతుని, భక్తుడు సేవించి తరించడానికి కల నవవిధ మార్గాలలో, కంచెర్ల గోపన్నగారు భక్తుడైన కవి కాబట్టి ఆయన ప్రస్తుతి మార్గాన్ని (తన కవిత ద్వారా) అనుసరిస్తానని చెబుతున్నాడు. కీర్తన అంటే గొప్పతనాన్ని వర్ణించడం, వైభవాన్ని వర్ణించి చెప్పడం అనే అర్థాలున్నాయి. కవి తన పద్యాల్లో ఆ పనిని చేస్తానని అంటున్నాడు. ఇంక తన ఇష్టదైవమైన రాముడు, ఎంతటి వైభవం కలవాడో క్రమంగా చెబుతున్నాడు.
బ్రహ్మ విష్ణు నాభికమలం నుంచి సంభవించినవాడన్నది ప్రసిద్ధమే.
సనకసనందనులు బ్రహ్మ మానసపుత్రులు. విష్ణ్భుక్తులు. దేవతలకంటె అనాదులైనవారు. గొప్ప భాగవతోత్తములు. విష్ణుమూర్తి సాన్నిధ్యంలో ఉండెడివారు. వారెప్పుడు శ్రీహరిని ధ్యానం చేస్తూ ఆయనను పరతత్త్వంగా కొలుస్తూ ఉంటారు.