నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చ. అసదృశవనం బిది యనన్యధనం బగు నొక్కొ నాకు ని
క్కుసుమ సముద్గమంబున నగోచర దుర్గమ దుర్గవల్లరీ
కుసుమ సముద్గమం బగునొకో! పతిలాభము లేమిఁ జేసి యొ
ప్ప్పెనఁగఁగ దేవయాని పతి నేమి తపం బొనరించి కాంచెనో !
భావం: సాటిలేని నా రుూ వనం అన్యలకు ఉపభోగ్యం కాక నాయందే జీర్ణించి పోవునా ఏమి? నాకు ఈ రజోదర్శనం (ఋతుమతీత్వం) భర్తృప్రాప్తి లేకపోవడం చేత ఇతరులకు ప్రవేశించేందుకు (వెళ్లేందుకు) శక్యం కాని కోటలోకి లతలకు పూచిన పుష్పాల పుట్టుక ఆగునా ఏమి అందమతిశయంచగా దేవయాని ఏమి గొప్పతనం చేసి భర్తను పొందిందో.... దేవయాని యయాతిని తనతండ్రి అధర్మదోషం అంటకుండా ఇచ్చిన వరం వల్ల పెళ్లిచేసుకొంది. కాని శర్మిష్ఠ ను తన దాసిగానే తన కోటలోని ఓ వనంలో ఓ ఇంట్లో ఆమె జీవించడానికి అనుమతిఇచ్చింది. కాని శుక్రుడు కూడా శర్మిష్ఠను దూరంగా పెట్టమనే సలహానిచ్చాడు యయాతికి. దేవయానికి ఇద్దరు కొడుకులు పుట్టినతరువాత వన వతి అయన శర్మిష్ఠ ఇలా ఆలోచిస్తోంది.