నేర్చుకుందాం

నేర్చుకుందాం( దాశరథి శతకం )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చ.జలనిధిలోన దూటి, కులశైలముమీటి, ధరిత్రిఁగొమ్మునం
దలవడమాటి, రక్కసునియంగముగీటి, బలీంద్రునిన్ రసా
తలమునమాటి, పార్థివకదంబము గూల్చినమేటి రామ, నా
తలఁపుననాటి రాఁగదవె, దాశరథీ కరుణాపయోనిధీ

భావం: ఓ దశరథరామా, నీవు మత్స్యమవై, వేదాల నుద్ధరించడానికి సోమకాసురుని సంహరించడానికి సముద్ర గర్భంలో ప్రవేశించినావు. కూర్మముగా మారి మందర పర్వతాన్ని పాలసముద్రంలో మునిగి దాన్ని ఎత్తి నిలిపినావు. వరాహరూపాన్ని ధరించి ప్రళయజలంలో మునిగిన భూమిని కోరకొమ్మున నెత్తికొని వచ్చినావు. ఉద్ధరించినావు. నరసింహుడవై, నీ భక్తుడైన ప్రహ్లాదుని రక్షించడానికి హిరణ్యకశిపుని దేహమును చీల్చినావు. వామనుడవై బలిచక్రవర్తిని పాతాళమునకు అణగద్రొక్కినావు. పరశురాముడవుగా, రాజసమూహాన్ని సంహరించినావు. అట్టి నీవు నా మనస్సులో స్థిరంగా నిలిచి ఉండుమా.

వ్యా: ఈ పద్యంలో విష్ణుని అవతారమైన శ్రీరాముడు ఎన్ని రూపాలలో అవతరించినాడో వర్ణించి చెప్పినాడు. జగదుత్పత్తి - స్థితి - ప్రళయాలకు భగవానుడు ఆహేతువు. హేతువునై దయామయుడై, సచ్చిదానందుడై అనేక లీలలను నిర్వహిస్తూ ఉంటాడు. ఆ భగవానుడు సగుణ సాకార చిన్మయరూపాన్ని ధ్యాన - ధారణ - నామజప - లీలాచింతనలతో భక్తుని, పాదకుని హృదయం పరిశుద్ధమవుతుంది. లోకంలో ధర్మసంస్థాపనకు, జ్ఞానసంరక్షణకు, భక్తులను రక్షించడానికి, దుష్టులను దుండగులను శిక్షించడానికి, భగవానుడు పదేపదే అవతరిస్తుంటాడు. ఈ అవతార రూపాలు దివ్యమైనవి. సచ్చిదానందమయములు. పరమ మంగళకరములు. అతిమానుష శక్తి స్వరూపుడు. సత్యస్వరూపుడైన భగవంతుని అవతారాలు అసంఖ్యాకాలుగా ఉంటాయని భావిస్తారు.