నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దాశరథి శతకం
*
ఉ గద్దరియోగి హృత్కమలగంధ రసాను భవంబుజె ందు పె
నినద్దపుగండు దేటి ధరణీ సుత కౌగిలి పంజరంబునన్
ముద్దులు గుల్కరాచిలుక, ముక్తినిధానమ , రామ, రాగదే
తద్దయు నేడు నాకడకు దాశరథీ కరుణాపయోనిధీ

భావం:పద్మపుష్పములలోని, తేనె మాధుర్యాన్ని అనుభవించే గండు తుమ్మెదల లాగ యోగశీలురైన భక్తులు హృదయాల్లో ఆనందాన్ని అనుభవించేవాడవును, గూటియందు రామచిల్క లాగా సీతాదేవి కౌగిలిలో సొంపులు గులుకువాడవును, మోక్షమిచ్చువాడవును అగు ఓ శ్రీరామ నేడు నాయొద్దకు వేగము రమ్ము. అత్యంతము నా దరికి రమ్మా.

వ్యా: కవి భక్తుడు. అతడు శ్రీరాముని దూరముగా దర్శించినంత మాత్రాన తృప్తిపొందినవాడు కాదు. భక్తితో తపోజపాదులు చేసే యోగుల మనస్సుల్లో భగవానుడు ఎలా నివసించి ఉంటాడో ఆ విధాంనే శ్రీరాముడు తన హృదయంలో నివాసముండాలని కాంక్షించేవాడు. రాముని సానిధ్యములో భక్తుడు ఉండాలని కోరుకునేవాడు. శ్రీరాముడు తనకు ప్రియురాలైన సీతాదేవి కౌగిలిలో పారవశ్యం చెందుతాడు. ఆమె సాంగత్యంలో ఉంటాడు. కవి కూడా శ్రీరాముడు తన సాంగత్యంలో ఉండాలని కోరుకుంటున్నాడు. మోక్షానికి ధనాగారం అయన శ్రీరాముని చేరుకుంటే మోక్షమనే ధనం లభిస్తుందని కవి ఆశ.