నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉ. దాసిన చుట్టమా శబరి? దాని దయామతి నేలినావు నీ
దాసుని దాసుఁడా గుహుఁడు? తావక దాస్యమొసంగినావు; నేఁ
జేసిన పాపమా? వినుతి సేసిన ఁ గానవు, గావుమయ్య, నీ
దాసుల లోన నేనొకఁడ దాశరథీ కరుణాపయోనిధీ!

భావం: ఓ దశరథరామా! శబరి అనే ఆటవిక స్ర్తి నీకు సన్నిహితమైన బంధువు కాకపోయినా ఆమెను దయతో కాపాడినావు. గుహుడు నీకు చేసే దాసులకు దాసుడైనవాడు కాదు కానీ అతనిని నీవు దాసునిగా చేసుకొంటివి. నేను నిన్ను స్తుతి చేసినవాణ్ణి. అంటే వారికంటె అధికుడను అయినప్పటికీ నన్ను కాపాడడంలో జాగు చేస్తున్నావు. దీనికి కారణం ఏమిటి ?నీ దాసులలో నేను కూడా ఒకడిని అని నీవు నన్ను కాపాడుము.

వ్యాఖ్యానం: సీతానే్వషణ చేస్తున్న రామలక్ష్మణులు మతంగవనంలో మహర్షులు చెప్పిన విధంగా తపశ్చర్చయ చేసి, తత్వజ్ఞానం పొంది దాశరథీ దర్శనం కోసం ఎదురుచూస్తున్న శబరి ఆశ్రమంలోకి ప్రవేశించారు. ఆమె రాముని చూడగానే పరమానందం పొంది అతిథి సత్కారాలు చేసింది. ఆమె కోరిక ఏమిటని అడిగిన రామునితో నాకు నీ సాయుజ్యం కావాలని కోరుకుంది. ఆమె కోరికను రాముడు తీర్చాడు. గుహుడు అరణ్యవాసానికి వెళ్తున్న రాముణ్ణి అతని సోదరుడిని, భార్యను కూడా గంగానదిని దాటించాడు. స్నేహితునిగా నా రాజ్యాన్ని తీసుకొని ఏలుము అని కూడా రామునితో గుహుడు చెప్పాడు. కానీ రాముడు రాజ్యం అక్కర్లేదని ఆలింగనం చేసుకొని ఆనందింపచేశాడు. నేను నిన్ను అక్షరాలతో స్తుతించాను. కనుక నీవే నన్ను ఎల్లవేళలా కాపాడుము అని కవి అభ్యర్థిస్తున్నాడు.