నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చ. జలనిధులేదు నొక్క మొగిఁ జిక్కి కిఁ దెచ్చె శరంబు రాతినిం
పలరఁగఁ జేసే నాతిగఁ బదాబ్జపరాగము నీ చరిత్రముం
జలజభవాది నిర్జరులు సన్నుతి సేయఁగ లేరు గావునన్
దలఁప నగణ్యమయ్య యిది దాశరథీ కరుణాపయోనిధీ!

భావం! ఓ దశరథరామా! నీ బాణము సప్తసముద్రాలను ఒక్కచోటికి కొనివచ్చింది. నీ పద్మాల వంటి పాదాల ధూళి, రాతిని వనితగా మార్చివేసింది. ఇట్టి నీ చరిత్ర బ్రహ్మ మొదలైన దేవతలకైనా పొగడ శక్యం కాదు. కాబట్టి నావంటివారికి గణుతింప సాధ్యమా !

వ్యాఖ్యానం: శ్రీరాముని పౌరుషం, సత్యసంధత, వాక్పటిమ మొదలైనవన్నీ ఎన్నదగినవి. శ్రీరాముని నామమే ఎంతో మేలును చేస్తుందని రాముని భక్తులు చెబుతారు. రాముడు చేసిన పనులను రాముని బాటలో నడవాలనుకొన్నవారంతా పదేపదే స్మరిస్తూ ఉంటారు. ఆ తొవ్వలోనే ఈ కవి కూడా రామా నీ పాద ధూళి రాతిని నాతిగా చేసింది కదా అంటున్నాడు. అంటే రాముని పాదధూళి సోకి గౌతముని శాపంతో రాయ అయ పడి ఉన్న అహల్య శాపవిమోచనం పొందింది కదా. (అవాల్మీకం)సముద్రుడు నిమ్మకు నీరెత్తినట్లుగా మీకు లంకాప్రయాణానికి దారి ఇవ్వకుండా వూరుకున్నప్పుడు నీకు గొప్ప కోపం వచ్చి లక్ష్మణునితో సముద్రజలాలను ఎండిపోయేట్టు చేస్తానని అన్నావు కదా. నీవు విడిచిన బాణము సప్త సముద్రాలను ఒక్కటిగా చేసేస్తుంది కదా మరి అంతటి ధీరోదాత్తుడివైన నీవు నాపై కరుణను ఎందుకు చూపడం లేదు? నీ పరాక్రమాదులు, నీ సత్వగుణాలు, నీ దానాదులు, నిన్ను శరణు కోరిన వారికి నీవిచ్చే అభయప్రదానాలు ఇలా నీవు చేసే పనుల్లో ఏవి కూడా లెక్కించరానవని కవి రాముని గుణగణాలను పొగడుతున్నాడు.