నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉ. పెట పెట నుక్కుగంబమున భీకర దంత నఖాంకుర ప్రనా
పటలము గప్ప నుప్పతిలి భండన వీధి నృసింహ భీకర
స్ఫుటపటుశక్తి హేమకశిపున్ విదలించి సురారి పట్టి ను
త్కట కృప ఁ జూచితీవె కదా. దాశరథీ కరుణాపయోనిధీ!

భావం:దశరథ రామా! నీవు ఉక్కు స్తంభంలో నరసింహమూర్తివై పెట పెట మనే ధ్వనితో ఉద్భవించి నీ పండ్ల యొక్క మొగ్గల వంటి కొనగోళ్ల యొక్క తెల్లని కాంతి సమూహాలు వ్యాపించగా భయంకరమైన శక్తిచే హిరణ్యకశిపుని రొమ్ము చీల్చి చంపి తరువాత వాని కుమారుడైన ప్రహ్లాదుని కాపాడినవాడవు నీవే కదా.

వ్యాఖ్యానం: ఈ పద్యంలో కవి నృసింహావతారాన్ని స్మరణ చేసుకొంటూ నాడు హిరణ్యకశిపుని చేష్టలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న ప్రహ్లాదుని కాపాడడానికి నీవే అటు నరుని రూపంలోను, ఇటు సింహరూపంలోను నారసింహునివై హిరణ్యకశిపుడు కోరుకున్నట్లుగానే స్తంభంనుంచి విడవడి హిరణ్యకశిపుని హృదయాన్ని చీల్చివేసి ప్రహ్లాదుని రక్షించినవాడవు నీవే కదా. నాలోని దుష్టత్వాన్ని చీల్చి వేసి నాలో సత్వగుణాన్ని ప్రోది చేసి నన్ను కాపాడుము అని కవి విష్ణుమూర్తిని వేడుకుంటున్నాడు. కలియుగంలో ఉన్నవారికి ఎన్నో రకాల బాధలు బాధిస్తుంటాయ. క్షణం కూడా చిత్తం మాటవినదు. మనస్సు నిలవదు. కనుక రాముని స్తుతించడం కష్టం కనుక నీవే నన్ను కాపాడుము అని కవి ప్రార్థిస్తున్నాడు. మనమూ ప్రార్థిద్దాం.